భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థత
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతి నొప్పితో బాధపడుతూ, కుటుంబ సభ్యుల సూచనతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చికిత్స కోసం చేరారు. ప్రస్తుతానికి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం ప్రకారం, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
జగదీప్ ధన్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌కి వెళ్లి ఆయనను పరామర్శించారు.