New Year: కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునే మొదటి దేశం ఎదో తెలుసా?
New Year Celebrations: ప్రపంచం 2025కు స్వాగతం
ప్రపంచం 2025కు స్వాగతం పలికేందుకు వేడుకల జోష్ మొదలైంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం ఒకే సమయానికి ప్రారంభం కాదు. నూతన సంవత్సరం మొదట ప్రారంభమయ్యే దేశం, చివరగా ప్రారంభమయ్యే ప్రదేశం గురించి తెలుసుకుందాం.
భూమి భ్రమణం కారణంగా విభిన్న టైమ్ జోన్లలో కొత్త సంవత్సరం వేర్వేరు సమయాల్లో మొదలవుతుంది. ఇది పసిఫిక్ సముద్రంలోని కొన్ని చిన్న దీవుల నుంచి ప్రారంభమై, ప్రపంచం నలుమూలలలో విస్తరిస్తుంది.
నూతన సంవత్సరాన్ని మొదట స్వాగతించే ప్రదేశం:
2025 సంవత్సరాన్ని మొదట స్వాగతించే ప్రదేశం రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటిలోని క్రిస్మస్ ఐలాండ్ (కిరిటిమతి). భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఇక్కడ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
అనంతరం,
•భారత కాలమానం ప్రకారం 3:45 గంటలకు న్యూజిలాండ్‌లోని చాథమ్ దీవులు నూతన సంవత్సర వేడుకలను ప్రారంభిస్తాయి.
•సాయంత్రం 4:30 గంటలకు ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి ప్రధాన నగరాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
•ఆ తరువాత టోంగా, సమోవా, ఫిజీ వంటి పసిఫిక్ దేశాలు కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొంటాయి.
ఆస్ట్రేలియాలో వేడుకలు:
•సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా నగరాల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు 2025 ప్రారంభమవుతుంది.
•అదే సమయంలో ఫిజీ ద్వీపాలు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.
•8:00 గంటలకు క్వీన్స్‌లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా వేడుకల్లో మునిగిపోతాయి.
ఆసియా దేశాల్లో వేడుకల సమయం:
•జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
•చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాల్లో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వేడుకలు జరుగుతాయి.
•థాయ్‌లాండ్, మయన్మార్, ఇండోనేషియాలో ఆ తరువాత జరగ్గా, బంగ్లాదేశ్, నేపాల్ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.
భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్:
భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు శ్రీలంకలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
•అనంతరం, రాత్రి 12:00 గంటలకు భారత్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిస్తుంది.
•భారత్ తరువాత పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ఈ వేడుకలను జరుపుకుంటాయి.

భూమిపై కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే చివరి ప్రదేశం హవాయికి నైరుతిలో ఉన్న బేకర్ & హౌలాండ్ ద్వీపాలు. ఇవి జనావాసాలు లేని మారుమూల దీవులు. ఇక్కడ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 5:30 గంటలకు 2025 సంవత్సరం అడుగుపెడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సమయాల్లో ప్రారంభమైనా, నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు, కలలు, ఉత్సాహంతో స్వాగతం పలుకుతారు. 2025 అందరికీ శాంతి, సంపద, ఆనందాన్ని అందించాలనే ఆశతో వేడుకల జోష్ కొనసాగుతుంది!